అపోలోలోహార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్ విజయవంతం..

- March 11, 2016 , by Maagulf
అపోలోలోహార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్ విజయవంతం..

అపోలో ఆస్పత్రి వైద్యనిపుణులు గుండెమార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. టెర్మినల్ హార్ట్ డిసీజ్‌తో బాధపడుతున్న వినయ్‌కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఫిబ్రవరి 26న గుండెమార్పిడి శస్త్ర చికిత్స చేశారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను జీ1 ద్వారా తీసుకుని ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను నిర్వహించామని డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే తెలిపారు. గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్‌ 85శాతం సక్సెస్ అవుతాయని దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తనకు పునర్జన్మ ప్రసాదించిన అపోలో వైద్యులకు పేషెంట్ వినయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com