సోషల్ మీడియాలో వధువు ప్రకటనలు..అడ్మిన్లకు కోర్టు సమన్లు
- July 29, 2021
సౌదీ: పెళ్లి చూపులు అంటే ఇప్పుడు మాట్రిమోనీలదే హవా.ఆన్ లైన్లో పెళ్లి చూపులు జరిగిపోతున్నాయి.అయితే..ఈ జోరులో కొందరు దేశ చట్టాలను, మతపరమైన విశ్వాసాలను నిర్లక్ష్యం చేస్తూ కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు.సౌదీ అరేబియాలో ఇదే తరహా ఉదంతం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వధువు ప్రకనటలు పోస్ట్ చేస్తుండంతో అడ్మిన్లకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమన్లు జారీ చేసింది.సోషల్ మీడియాలో వధువు ప్రకటనలు మహిళల గౌరవానికి హాని కలిగించే విధంగా ఉండటమే కాకుండా ఇస్లామిక్ షరియా, దేశ చట్టాలను ఉల్లంఘించటమేనని కోర్టు అభిప్రాయపడింది. ప్రజా నైతిక విలువలు, మతపరమైన నిబంధనలకు విరుద్ధంగా సోషల్ మీడియాలో వధువు ఫోటో, ఆమె వివరాలతో వస్తున్న ప్రకటనలపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ లోని సైబర్ క్రైమ్ ఇన్విస్టిగేషన్ డిపార్ట్మెంట్ విచారణ చేపట్టింది. పలు సోషల్ మీడియాలో ప్రకటలు ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత అడ్మిన్లకు కోర్టు సమన్లు జారీ చేసింది.
తాజా వార్తలు
- పార్కింగ్ ఫీజులు పెరుగుదలపై పార్కిన్ CEO క్లారిటీ..!!
- ఒమానీ–బహ్రెయిన్ బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఆప్టామిల్, బెబెలాక్ ఇన్ఫాంట్ ఫార్ములా పై SFDA హెచ్చరిక..!!
- ముహారక్ సౌక్ భవిష్యత్ పై కౌన్సిల్ సమీక్ష..!!
- కువైట్ జాతీయ దినోత్సవం..అద్భుతమైన వైమానిక ప్రదర్శన..!!
- విజిట్ ఖతార్..అల్ రువైస్ మారిటైమ్ హెరిటేజ్ ఫెస్టివల్..!!
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు









