బోనాలకు పూర్తిస్థాయిలో బందోబస్తు: సీపీ అంజనీకుమార్
- July 31, 2021
హైదరాబాద్: రేపు హైదరాబాద్‌లో లాల్‌దర్వాజా బోనాలు జరగనున్నాయి.ఇదే రోజు హైదరాబాద్ మొత్తం… శివారు ప్రాంతాలు.. మరికొన్ని గ్రామాల్లో కూడా బోనాలు తీయనున్నారు.దీంతో.. పోలీసులు అప్రమత్తం అయ్యారు.. సిటీలో జరిగే బోనాల ఉత్సవాలకు భారీ భద్రత ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు సీపీ అంజనీకుమార్.. బోనాలు, అంబారీ ఊరేగింపు సందర్భంగా వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించిన ఆయన.. కమిషనర్ నుంచి హోంగార్డు వరకూ అందరూ బందోబస్తు విధుల్లో పాల్గొంటారని.. పాతబస్తీలోని పలు కాలనీల నుంచి బోనాల ఊరేగింపు లాల్ దర్వాజా మహంకాళి ఆలయానికి చేరుకుంటుందని.. రంగం, పోతురాజు ప్రవేశం కూడా ఉంటుందని.. అన్ని కార్యక్రమాలు సాఫీగా సాగేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.. బోనాలు విజయవంతంగా నిర్వహించేందుకు.. అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నామన్న సీపీ.. 8 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. లాల్‌దర్వాజలోని మహంకాళి టెంపుల్‌తో పాటు సిటీలో ఉన్న అన్ని ఆలయాల్లో పూజలు ఉండనున్నాయి.ఎల్లుండి రంగంతో పాటు అంబారీ ఊరేగింపు కూడా ఉండడంతో.. ట్రాఫిక్ డైవర్షన్లు ఉంటాయి.ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సీసీ టీవీల ద్వారా ఊరేగింపును పర్యవేక్షిస్తామని సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్‌లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!









