కాంస్య పతకం గెలిచిన పి.వి సింధు
- August 01, 2021
టోక్యో: భారత స్టార్ షట్లర్ పి.వి సింధు టోక్యో ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి పతకం సాధించి రికార్డుకెక్కింది. కోట్లాది మంది భారతీయులు కోరుకున్నట్టే ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకాన్ని అందించింది. కాంస్య పతకం కోసం కొద్దిసేపటి క్రితం ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హే బింగ్‌జియావో (చైనా)తో జరిగిన పోరులో వరుస సెట్లలో (21-13, 21-15) విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఫలితంగా రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత వ్యక్తిగతంగా రెండు ఒలింపిక్ మెడల్స్ అందుకున్న అథ్లెట్‌గా రికార్డులకెక్కింది.
నిన్నసెమీస్‌లో వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ చేతిలో ఓడిన సింధు నేడు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తగా ఆడింది.పూర్తి ఎనర్జీతో, మంచి ఫుట్‌వర్క్‌తో కనిపించింది. చివరి వరకు అదే ఊపు కనిపించి రెండో సెట్‌ను కైవసం చేసుకున్న సింధు కాంస్యంతో మెరిసింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







