స్కూళ్ల ప్రారంభంపై కసరత్తు..ఇవాళ తుది నిర్ణయానికి అవకాశం

- August 02, 2021 , by Maagulf
స్కూళ్ల ప్రారంభంపై కసరత్తు..ఇవాళ తుది నిర్ణయానికి అవకాశం

కువైట్: స్కూళ్ల ప్రారంభానికి ఉన్న అవకాశాలు, సంసిద్ధతపై కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో స్కూళ్ల నిర్వహణకు ఉన్న సాధ్యసాధ్యాలు, అడ్డంకులపై చర్చించింది. కోవిడ్ నేపథ్యంలో విద్యార్ధుల ఆరోగ్య భద్రతకు భరోసా ఇస్తూనే స్కూళ్లను నిర్వహించే పక్కా ప్రణాళిక, అందుకు మద్దతుగా అనుసరించాల్సిన ప్రణాళికలపై ఆరా తీసింది. స్కూళ్లలో స్టెరిలైజేషన్ చేపట్టడం, విద్యార్ధులు భౌతిక దూరం పాటించటం, స్కూల్ సిబ్బంది అందరికి వ్యాక్సిన్ అందించటం వంటి చర్యలతో స్కూళ్లను ప్రారంభించటం, విద్యార్ధులకు సురక్షిత వాతావరణాన్ని కల్పించటం సాధ్యమేనా అని డిస్కస్ చేసింది. ఇదిలాఉంటే కువైట్ మంత్రిమండలి నేడు సమావేశం కానుంది. ఈ సమావేశంలో స్కూళ్ల ప్రారంభంపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com