స్కూళ్ల ప్రారంభంపై కసరత్తు..ఇవాళ తుది నిర్ణయానికి అవకాశం
- August 02, 2021
కువైట్: స్కూళ్ల ప్రారంభానికి ఉన్న అవకాశాలు, సంసిద్ధతపై కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో స్కూళ్ల నిర్వహణకు ఉన్న సాధ్యసాధ్యాలు, అడ్డంకులపై చర్చించింది. కోవిడ్ నేపథ్యంలో విద్యార్ధుల ఆరోగ్య భద్రతకు భరోసా ఇస్తూనే స్కూళ్లను నిర్వహించే పక్కా ప్రణాళిక, అందుకు మద్దతుగా అనుసరించాల్సిన ప్రణాళికలపై ఆరా తీసింది. స్కూళ్లలో స్టెరిలైజేషన్ చేపట్టడం, విద్యార్ధులు భౌతిక దూరం పాటించటం, స్కూల్ సిబ్బంది అందరికి వ్యాక్సిన్ అందించటం వంటి చర్యలతో స్కూళ్లను ప్రారంభించటం, విద్యార్ధులకు సురక్షిత వాతావరణాన్ని కల్పించటం సాధ్యమేనా అని డిస్కస్ చేసింది. ఇదిలాఉంటే కువైట్ మంత్రిమండలి నేడు సమావేశం కానుంది. ఈ సమావేశంలో స్కూళ్ల ప్రారంభంపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







