వ్యాక్సిన్ పొందిన సెకండరీ స్టూడెంట్స్ కి డైరెక్ట్ క్లాసులు

- August 02, 2021 , by Maagulf
వ్యాక్సిన్ పొందిన సెకండరీ స్టూడెంట్స్ కి డైరెక్ట్ క్లాసులు

సౌదీ: ఇన్నాళ్లు వర్చువల్ క్లాసెస్ కే పరిమితమైన విద్యార్ధులు ఇక నుంచి వ్యక్తిగతంగా క్లాసులకు హజరు కావాలని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.వ్యాక్సినేషన్ పొందిన ఇంటర్మీడియట్, సెకండరీ స్కూల్ విద్యార్ధులకు ఫేస్ టు ఫేస్ క్లాసులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అయితే..ప్రైమరీ, గార్టెన్ విద్యార్థులకు మాత్రం కింగ్డమ్ వ్యాప్తంగా 70 శాతం మందికి వ్యాక్సిన్ అందిన తర్వాతగానీ, లేదంటే అక్టోబర్ 30, 2021 నుంచి గానీ డైరెక్ట్ క్లాసులు నిర్వహించనున్నారు. ఒకవేళ ఆక్టోబర్ 1 కంటే ముందే 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తైతే అప్పటి నుంచే ఫేస్ టు ఫేస్ క్లాసులు ప్రారంభం అవుతాయి. ఇదిలాఉంటే..కింగ్డమ్ వ్యాప్తంగా ఇప్పటివరకు 27 మిలియన్ల మందికి వ్యాక్సిన్ అందించారు. ప్రస్తుతం సౌదీలో ఆస్ట్రాజెనెకా, ఫైజర్-బయోటెక్, జాన్సన్ & జాన్సన్, మోడర్నా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com