2.51 మిలియన్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్
- August 03, 2021
కువైట్: కువైట్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ పొందిన వారి సంఖ్య 2.51 మిలియన్లకు చేరుకుందని ఆరోగ్య మంత్రి డాక్టర్ షేక్ బాసిల్ అల్-సబా తెలిపారు. ప్రతి వారం నిర్వహించే మంత్రిమండలి సమావేశంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో కోవిడ్ వ్యాప్తి పరిస్థితులు స్థిరత్వ దశలో ఉన్నందున కోవిడ్ వ్యాప్తి, మరణాల రేటులో తగ్గుదల నమోదవుతున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ రికవరీ రేటు 96 శాతంగా ఉందన్నారు. మంత్రి వెల్లడించిన వివరాలు, కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యల పట్ల కేబినెట్ సంతృప్తి వ్యక్తం చేసింది. మహమ్మారిపై విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని, అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు మంత్రిమండలి పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- జనవరిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!
- చైల్డ్ స్టే సేఫ్.. జర్నీ ఆఫ్ సేఫ్టీ గేమ్ ప్రారంభం..!!
- నాటోయేతర మిత్రదేశంగా సౌదీ.. ట్రంప్
- ఆస్ట్రేలియాలో BMW ప్రమాదం..8 నెలల గర్భిణితో ఉన్న భారతీయ మహిళ మృతి







