365 డేస్ సర్వీస్: దుబాయ్‌లోని భారత కాన్సులేట్ తొలి వార్షికోత్సవం
- August 03, 2021
దుబాయ్: ప్రవాసులకు అత్యావసర సేవలను మరింత చేరువ చేసేందుకు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ గత ఏడాది ఆగస్టు 1న '365 డేస్ సర్వీస్' పేరిట కొత్త సర్వీసును తీసుకొచ్చింది. ఆగస్టు 1తో ఈ సేవలకు ఏడాది పూర్తైన సందర్భంగా ఆదివారం కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తొలి వార్షికోత్సవం నిర్వహించింది.ఏడాది పొడువునా, వారంలో ఏడు రోజులు, రోజుకు 24 గంటలు '365 డేస్ సర్వీస్' ద్వారా సేవలు అందించింది.వీకెండ్స్, సెలవు రోజుల్లో కూడా ఈ సర్వీస్ కొనసాగింది. 2020, ఆగస్టు 1న దుబాయ్‌కు కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డా.అమన్ పూరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దుబాయ్‌లోని భారత సమాజానికి 24/7 అత్యావసర సేవలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ '365 డేస్ సర్వీస్'కు శ్రీకారం చుట్టారు.ముఖ్యంగా వీకెండ్స్, హాలీడేస్‌లో కూడా ప్రవాసులకు ఎమర్జెన్సీ సర్వీసులు అందించడం జరిగిందని ఈ సందర్భంగా అమన్ పూరి అన్నారు. వీకెండ్స్, సెలవు రోజుల్లో కాన్సులేట్ కార్యాలయాన్ని అత్యావసర సేవల కోసం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ సర్వీసును ట్రావెల్ ధృవపత్రాల(పాస్‌పోర్టు,ఎమర్జెన్సీ సర్టిఫికేట్స్, వీసాలు, ఇతర సేవలు) జారీ విషయంలో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం విస్తరించునున్నట్లు తెలిపారు.


తాజా వార్తలు
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్‌లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!
- చైల్డ్ స్టే సేఫ్.. జర్నీ ఆఫ్ సేఫ్టీ గేమ్ ప్రారంభం..!!
- నాటోయేతర మిత్రదేశంగా సౌదీ.. ట్రంప్
- ఆస్ట్రేలియాలో BMW ప్రమాదం..8 నెలల గర్భిణితో ఉన్న భారతీయ మహిళ మృతి
- ఏపీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు







