నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణీకుల్ని అనుమతిస్తే, విమానయాన సంస్థలకు జరీమానా
- August 03, 2021
కువైట్: నాన్ కువైటీ ప్రయాణీకుడ్ని నిబంధనలకు విరుద్ధంగా విమానంలోకి అనుమతిస్తే, ఆ విమానయాన సంస్థపై జరీమానాలు తప్పవని డిజిసిఎ వర్గాలు వెల్లడించాయి. ఒక్కో ప్రయాణీకుడికి 500 దినార్ల చొప్పున జరీమానా వుంటుంది. ఉల్లంఘన మరోసారి జరిగితే జరీమానా రెండింతలవుతుంది. నిబంధనల ప్రకారం వలస ప్రయాణీకులు, తమ వ్యాక్సిన్ సర్టిఫికెట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పోర్టల్ ద్వారా అప్‌లోడ్ చేయాల్సి వుంటుంది. దానికి గ్రీన్ కలర్ స్టేటస్ లభించాల్సి వుంటుంది. కాగా, ఈ నిబంధన అమల్లోకి వచ్చాక చాలా తక్కువమంది ప్రయాణీకులు మాత్రమే నిబంధనలు పాటించడంలేదని అధికారులు గుర్తించారు. ఎక్కువమంది నిబంధనలు పాటిస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రతి ప్రయాణీకుడు 72 గంటల ముందుగా తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ తమ వెంట తెచ్చుకోవాలి.
తాజా వార్తలు
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు







