ఏపీ కరోనా అప్‌డేట్..
- August 04, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ భారీగా పెరిగాయి.ఇదే సమయంలో టెస్ట్‌ల సంఖ్య కూడా పెంచారు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 85,822 శాంపిల్స్ పరీక్షించగా.. 2,442 మందికి పాజిటివ్‌గా తేలింది.మరో 16 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు.ఇదే సమయంలో.. 2,412 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
తాజా మృతుల్లో చిత్తూరులో ఐదుగురు, అనంతపురం, కృష్ణా, నెల్లూరు జిల్లాలో ఇద్దరు చొప్పున.. తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కర్నూలు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.. మొత్తంగా రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,73,996కు పెరగగా… రికవరీ కేసుల సంఖ్య 19,40,368కు చేరింది. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 13,444 మంది మృతిచెందారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 20,184 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









