ఏపీ కేబినెట్ మీటింగ్.. కీలక నిర్ణయాలు ఇవే
- August 06, 2021
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. నవరత్నాల పథకాల అమలు, జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్ల ఏర్పాటుపై కేబినెట్లో చర్చించారు.ఈ నెల 10న అమలు చేయనున్న వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకంపై కూడా చర్చించారు. పులిచింతల ప్రాజెక్ట్ గేటు విరిగిన అంశంపై కేబినెట్లో చర్చించారు. 20 నిముషాల పాటు స్టాప్ లాక్ గేటు, హైడ్రాలిక్ గేట్ల ఏర్పాటుపై సమావేశంలో చర్చ జరిగింది.
కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే…
- 1.నూతన విద్యావిధానం ప్రకారం స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరణ ఖరారు
- 2.శాటిలైట్ స్కూల్స్ ( పీపీ–1, పీపీ–2)
- 3.ఫౌండేషన్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2)
- 4.ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ ( పీపీ–1 నుంచి 5వ వరగతి వరకూ)
- 5.ప్రీ హైస్కూల్స్ ( 3 నుంచి 7లేదా 8వ తరగతి వరకూ)
- 6.హైస్కూల్స్ ( 3 నుంచి 10వ తరగతి వరకూ )
- 7.హైస్కూల్ ప్లస్ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ)
- 8.విద్యార్థులకు ప్రాథమిక దశలోనే మంచి విద్య అందించేలా విప్లవాత్మక చర్యలు
- 9.ఏ తరగతికి అయినా తెలుగు తప్పనిసరిగా ఉంటుంది
- రాష్ట్రంలో కొత్తగా 4,800 తరగతి గదుల నిర్మాణం
- నేతన్న నేస్తానికి 200 కోట్ల రూపాయలు కేటాయింపు
- ఆగస్టు 10న 3వ విడుత నేతన్న నేస్తం
- 20 వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు ఈనెల 24న చెల్లింపులు
- ఈ నెల 14న విద్యాకానుక పంపిణీ
- అభ్యంతరం లేని భూముల్లో ఆక్రమణల క్రమబద్దీకరణకు ఆమోదం
- రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారటీ ఏర్పాటు
- ఇకపై కాకినాడ డెవలప్మెంట్ అథారటీగా గోదావరి అర్బన్ డెవలప్ అథారటీ
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







