జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌కు కేంద్రం ఆమోదం

- August 07, 2021 , by Maagulf
జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌కు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ: కరోనాను అంతమొందించేందుకు వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గం ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అత్యవసర వినియోగానికి మరో వ్యాక్సిన్‌ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు ఆమోదం తెలిపింది. ఇది సింగిల్‌ డోస్‌ కరోనా వ్యాక్సిన్‌.వ్యాక్సిన్‌ వినియోగానికి ఆమోదించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ ట్వీట్‌ చేశారు. ' భారత్‌ తన వ్యాక్సిన్‌ బాస్కెట్‌ను విస్తరిస్తోంది. భారత్‌లో అత్యవసర వినియోగానికి జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్‌ డోసు కోవిడ్‌-19 టీకా ఆమోదించాం. ప్రస్తుతం దేశంలో దేశంలో ఐదు వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి ఆమోదించాం. కరోనాపై పోరు సాగిస్తున్న భారత్‌కు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది' అని ట్వీట్‌ చేశారు. అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకున్న రెండు రోజులకు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు ఆమోదం లభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com