మరోసారి టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి…
- August 08, 2021
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించింది. ఛైర్మన్ పదవీకాలం రెండేళ్లు. రెండేళ్ల తరువాత వైవీ సుబ్బారెడ్డిని మారుస్తారనే ఊహాగానాలు వచ్చాయి.అయితే, వాటిక్ చెక్ పెడుతూ ఏపీ ప్రభుత్వం మరోసారి వైవీని టీటీడీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండోసారి అవకాశం ఇవ్వడం పట్ల వైవీ సుబ్బారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నామని, స్వామివారి కైంకర్యాలకు, ఛైర్మన్ పదవికి ఎలాంటి మచ్చ తీసుకురాకుండా పరిపాలన సాగించామని, ఇకపై కూడా తిరుమల అభివృద్ధికి కృషిచేస్తామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.త్వరలోనే టీటీడీ బోర్డు సభ్యులను నియమించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







