టోక్యో ఒలింపిక్స్: సాయొనారా.. ముగిసిన ఒలింపిక్స్..
- August 08, 2021
టోక్యో: టోక్యో లో ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి.19 రోజులపాటు మొత్తం ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ ఆటల పండుగ..ఆదివారం క్లోజింగ్ సెర్మనీతో సాయొనారా గుడ్ బై చెప్పింది.ముగింపు సందర్భంగా మరోసారి అన్ని దేశాలకు చెందిన అథ్లెట్లు తమ జాతీయ పతాకాలతో స్టేడియంలోకి వచ్చారు.భారత్ తరఫున బ్రాంజ్ మెడల్ విన్నర్,రెజ్లర్ భజరంగ్ పూనియా త్రివర్ణ పతాకంతో సందడి చేశాడు.కరోనా మహమ్మారి వణికస్తున్న సమయంలో విజయవంతంగా ఈ విశ్వక్రీడా సంబరాన్ని నిర్వహించిన టోక్యోకు అథ్లెట్లు కృతజ్ఞతలు తెలిపారు. క్లోజింగ్ సెర్మనీ ప్రారంభంలో జపాన్ క్రౌన్ ప్రిన్స్ అకిషినో, ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్‌తో కలిసి స్టేడియంలోకి వచ్చారు.

మూడేళ్ల తర్వాత 2024లో ఈ గేమ్స్‌ను నిర్వహించడానికి ఫ్రాన్స్ రాజధాని పారిస్ సిద్ధమవుతోంది. క్లోజింగ్ సెర్మనీ సందర్భంగానే మెన్స్, వుమెన్స్ మారథాన్ విజేతలకు మెడల్స్ అందజేశారు.కెన్యాకు చెందిన పెరెస్ జెప్‌చిర్‌చిర్ మహిళల మారథాన్ విజేతగా నిలిచింది.ఆ తర్వాతి స్థానంలో కెన్యాకే చెందిన బ్రిగిడ్ కోస్గీ,మూడో స్థానంలో మోలీ సీడెల్ నిలిచింది.ఇక పురుషుల మారథాన్ టైటిల్ నిలబెట్టుకున్నాడు కెన్యాకు చెందిన కిప్‌చోగె.నెదర్లాండ్స్‌కు చెందిన నగీయె,బెల్జియంకు చెందిన అబ్ది రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







