గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా త్రి చక్ర వాహనాలు అందించిన మంత్రి కేటీఆర్
- August 08, 2021
హైదరాబాద్: తన జన్మదినం సందర్భంగా వికలాంగులకు మూడు చక్రాల వాహనాలు అందిస్తానని తెలిపిన ప్రకారం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి తారక రామారావు వికలాంగులకు వాహనాల పంపిణీ ని మొదలు పెట్టారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తొలి విడత వాహనాల పంపిణీ కార్యక్రమం ఈ రోజు హైదరాబాదులోని జలవిహార్ లో జరిగింది. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కేటీఆర్ జన్మదినం సందర్భంగా వికలాంగుల కోసం త్రిచక్ర వాహనాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈరోజు జరిగిన తొలి విడత వాహనాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు కృష్ణారావు, వివేక్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ రావు,వికలాంగుల కోసం తాము ప్రకటించిన వాహనాలను మంత్రి కేటీఆర్ చేతులమీదుగా అందించారు.ఇప్పటికే వాహనాలను ప్రకటించిన ప్రజా ప్రతినిధులు మిగిలిన చోట్ల ఆయా నియోజకవర్గాల్లో వాహనాలను త్వరలోనే పంపిణీ చేస్తామని తెలిపారు.

గత ఏడాది తన బర్త్ డే సందర్భంగా మంత్రి కే తారకరామారావు ఆరు అంబులెన్సులను సిరిసిల్లకు అందించారు.ఆ తరువాత మంత్రి కేటీఆర్ అడుగుజాడల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మరో వంద అంబులెన్సులను ప్రకటించారు. ఈసారి కూడా తన జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలు, పత్రికా ప్రకటనలు,సంబరాలు మరియు ఇతర వృధా ఖర్చులు పైన కాకుండా ఇతరులకు సహకారం అందించేలా తమకు తోచిన విధంగా సహాయం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆ మేరకు తన వంతుగా 100 త్రి చక్ర వాహనాలను వికలాంగుల కోసం అందిస్తానని ప్రకటించారు.ఈసారి కూడా మంత్రి కేటీఆర్ మార్గంలోని ముందుకు వచ్చిన అనేక ప్రజా ప్రతినిధులు వందలాది త్రిచక్ర వాహనాలను అందించేందుకు ముందుకొచ్చారు.

వికలాంగుల కోసం వాహనాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వారందరికీ మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ వాహనాలు కేవలం వారి రవాణా కోసమే కాకుండా ఒక జీవన ఉపాధి కల్పించి తమ కాళ్ళపై నిలబడే విధంగా ఉంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.వాహనాలు అందుకున్న వికలాంగులతో మాట్లాడిన మంత్రి కేటీఆర్, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో వారితో భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ నియోజకవర్గ నాయకులు తలసాని యాదవ్ తో పాటు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







