నల్సా యాప్ను ప్రారంభించిన జస్టిస్ ఎన్వీ రమణ
- August 08, 2021
న్యూ ఢిల్లీ: పేదలకు ఉచిత న్యాయసాయం అందించే దిశగా సుప్రీంకోర్టు కొత్త ఆవిష్కరణకు నాంది పలికింది. ఢిల్లీలో లీగల్ సర్వీస్ మొబైల్ యాప్ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. నల్సా యూనివర్శిటీ రూపొందించిన ఈ నూతన యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జస్టిస్ యుయు లలిత కూడా పాల్గొన్నారు. న్యాయ సేవలు నేరుగా మొబైల్ ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు ఈ లీగల్ సర్వీస్ మొబైల్ యాప్ ఉపయోగపడతాయని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. భారతదేశం అత్యంత పెద్ద ప్రజాస్వామ్యంతో పాటు ఉన్నతమైన న్యాయవ్యవస్థ కలిగి ఉందని చెప్పారు. పోలీస్స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘన, వేధింపులపై సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో కస్టోడియల్ టార్చర్ సహా పోలీసుల వేధింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేక న్యాయ సహాయం అందించడంలో అవరోధాలు ఏర్పడుతున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







