భారతీయులు కువైట్ తిరిగొచ్చే విషయమై ఇబ్బందుల పరిష్కారం కోసం చర్చలు జరిపిన భారత రాయబారి
- August 10, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండర్ సెక్రెటరీ డాక్టర్ ముస్తఫా రెధా, భారత రాయబారి సిబి జార్జికి ఘనంగా స్వాగతం పలికారు. డిపార్టుమెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ హెల్త్ రిలేషన్స్ డైరెక్టర్ డాక్టర్ రెహాబ్ అల్ వాతిన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. భారత్ - కువైట్ మధ్య వైద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించి అందుతున్న పరస్పర సహకారంపై ఇరువర్గాలూ చర్చించడం జరిగింది. మెడికల్ స్టాఫ్ (భారతీయ డాక్టర్లు, నర్సులు టెక్నికల్ స్టాఫ్) నియామకాల గురించి చర్చించారు. కాగా, కరోనా పాండమిక్ నేపథ్యంలో భారతదేశం నుంచి రావాల్సినవారికి ఎదురవుతున్న ఇబ్బందులపైన కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఆయా ఇబ్బందులపై ఎప్పటికప్పుడు సమీక్షించి చర్యలు తీసుకుంటున్నట్లు డాక్టర్ రెధా చెప్పారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







