యూఏఈ వచ్చేవారికి ఊరటనిచ్చే వార్త

- August 10, 2021 , by Maagulf
యూఏఈ వచ్చేవారికి ఊరటనిచ్చే వార్త

యూఏఈ: ఇండియా తో సహా వివిధ దేశాల్లో చిక్కుకున్న ప్రవాసీయులు యూఏఈ కు తిరిగిరావచ్చు అని ప్రకటించినట్టే ప్రకటించి; యూఏఈ లో వ్యాక్సిన్లు వేసుకున్న నివాసితులు మాత్రమే ఎంట్రీ అని కొసమెరుపు పెట్టి ఎందరినో ఇబ్బందిలో పడేసింది యూఏఈ. దీంతో ఇరు దేశాల ప్రభుత్వాలకు సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున తమ గోడు వినిపించుకున్నారు ప్రవాసీయులు.

ప్రవాసీయులు చేస్తున్న విన్నపాలను దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 15 నుండి యూఏఈ ఆమోదించిన వ్యాక్సిన్లను తమ స్వదేశాల్లో తీసుకున్నా, వారిని అనుమతించేందుకు ఓకే చెప్పేసింది యూఏఈ.

యూఏఈ లో ఆమోదించబడిన వ్యాక్సిన్లు ఇవి:

1.        ఫైజర్

2.       ఆస్ట్రాజెనెకా లేదా కోవిషీల్డ్

3.       సినోఫార్మ్

4.       స్పుత్నిక్

5.       మోడెర్నా

6.       జాన్సన్ & జాన్సన్

7.       సినోవాక్ (కరోనావాక్)

8.       నోవావాక్స్

మరి కోవాక్సిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారి సంగతి ఇంకా అయోమయంగా ఉండటం గమనార్హం. "మేము ఇరు దేశాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాం. త్వరలో కోవాక్సిన్ తీసుకున్నవారు యూఏఈ వచ్చేందుకు అనుమతించబడతారా లేదా అనే దానిపై స్పష్టత ఇస్తాము" అని దుబాయ్ లోని భారత కాన్సులేట్ అధికారి మాగల్ఫ్ కు తెలియజేసారు.

వీరికి మాత్రం మినహాయింపు:

వ్యాక్సిన్లు తీసుకున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా యూఏఈ లో పనిచేసే వైద్యులు, నర్సులు మరియు సాంకేతిక నిపుణులు ఈ ప్రయాణ నిషేధం నుండి మినహాయించబడ్డారు. అలాగే విద్యా రంగంలో పనిచేస్తున్న నివాసితులు, విద్యార్థులు, ప్రభుత్వ సంస్థలలో పనిచేసే కార్మికులు కూడా అనుమతించబడ్డారు. యూఏఈ లో చికిత్స పూర్తి చేయాల్సిన వారు కూడా మినహాయించబడిన వర్గంలో ఉన్నారు.

మినహాయించబడిన అన్ని వర్గాలు అవసరమైన అనుమతులు పొందేందుకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ సిటిజన్‌షిప్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సమర్థులైన అధికారులు ఆమోదించిన వ్యాక్సిన్ సర్టిఫికెట్‌లను వారు అప్లికేషన్‌తో పాటు జతపరచాలి.

ICA దరఖాస్తు విధానం:

దేశానికి తిరిగి వచ్చే యూఏఈ నివాసితులు తమ విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు షరతులను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని ట్రావెల్ ఏజెంట్లు సూచించారు. మొదటగా నెగటివ్ పిసిఆర్ పరీక్ష రిపోర్ట్ పొందడం, తర్వాత 'ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్' (ICA) వెబ్‌సైట్ (https://uaeentry.ica.gov.ae) లో ప్రయాణానికి సంబంధించి అనుమతి ను తనిఖీ చేయడం ముఖ్యం. యూఏఈ వచ్చే ప్రయాణీకుల కోసం 'ప్రీ-ట్రావెల్ అప్రూవల్' (ప్రయాణానికి ఆమోదం తెలిపే) సిస్టమ్‌ను అప్‌డేట్ చేసింది ICA. ఆమోదం తెలిపే దశలో కఠినమైన పరిశీలన ప్రక్రియను ఏర్పాటు చేసింది ICA.

ఈ అప్‌డేట్ చేయబడిన ICA అప్రూవల్ వెబ్‌పేజీ (https://uaeentry.ica.gov.ae) లో ప్రయాణికులు తమ పాస్‌పోర్ట్ వివరాలు, వ్యాక్సిన్ సమాచారం, PCR పరీక్ష ఫలితాలను ప్రయాణానికి ముందు అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది.

ప్రయాణ అనుమతికి అవసరమైన పత్రాలు, అప్-లోడ్ చేసే విధానం:

1. దరఖాస్తుదారు సమాచారాన్ని పూరించండి.

* దరఖాస్తుదారు సమాచారంలో పేరు, లింగం, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశం, తిరిగి వచ్చే తేదీ (తమ దేశానికి తిరిగి వెళ్లే వారికి వర్తిస్తుంది), ప్రయాణించే దేశం పేరు, ప్రయాణానికి బయలుదేరే దేశం పేరు, ఇ-మెయిల్ వంటి వివరాలు ఉంటాయి.

* మీ ఇ-మెయిల్‌కు ఒక QR కోడ్ పంపబడుతుంది. దయచేసి నమోదు చేసిన ఇమెయిల్ సరైనదని నిర్ధారించుకోండి.

2: పాస్‌పోర్ట్ సమాచారాన్ని పూరించండి.

* దరఖాస్తుదారులు పాస్‌పోర్ట్ రకం, గడువు తేదీ, ఇష్యూ తేదీ, నంబర్ మరియు ఇష్యూ దేశం వివరాలు నింపాలి.

3: యూఏఈ లోని చిరునామాను పూరించండి.

* మొబైల్ నంబర్‌తో పాటు UAE లో స్థానిక చిరునామాను అందించండి.

4: వ్యాక్సిన్ మరియు PCR పరీక్ష తేదీలను పూరించండి.

* నివాసితులు ఈ రూపంలో ఎంచుకోగల ఎనిమిది వ్యాక్సిన్ ల జాబితాను ICA అందించింది, అవి: స్పుత్నిక్-వి, జాన్సెన్ & జాన్సన్, మోడెర్నా, నోవావాక్స్, ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌, సినోఫార్మ్, సినోవాక్.

* దరఖాస్తుదారులు తమ మొదటి, రెండవ మరియు మూడవ మోతాదులను (వర్తించే చోట) అందుకున్న తేదీలను పూరించాలి. PCR పరీక్ష తేదీ మరియు పరీక్ష ఫలితాల తేదీలను కూడా తప్పనిసరిగా పేర్కొనాలి.

5: పత్రాలను అప్‌లోడ్ చేయండి.

* పాస్‌పోర్ట్ కాపీ, మీ ఫోటో మరియు పిసిఆర్ పరీక్ష ఫలితాలు తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.

6: ప్రకటనలు

* యూఏఈ ఆరోగ్య అధికారుల చట్టాలను పూర్తిగా పాటించాలని పేర్కొన్న వెబ్‌సైట్ డిక్లరేషన్ బటన్‌పై క్లిక్ చేయండి మరియు జతచేయబడిన అన్ని పత్రాలు సరైనవని నిర్ధారించండి.

7: 'సబ్మిట్' బట్టన్ నొక్కండి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com