సెప్టెంబర్ 9 నుంచి బహ్రెయిన్‌కి విమానాలు నడపనున్న విజ్ ఎయిర్ అబుధాబి

- August 11, 2021 , by Maagulf
సెప్టెంబర్ 9 నుంచి బహ్రెయిన్‌కి విమానాలు నడపనున్న విజ్ ఎయిర్ అబుధాబి

యూఏఈ: యూఏఈకి చెందిన కొత్త ఎయిర్ లైన్స్ సంస్థ విజ్ ఎయిర్ దుబాయ్, సెప్టెంబర్ 9 నుంచి బహ్రెయిన్‌కి విమానాలు నడపనుంది. వారంలో మూడు విమానాలు నడుస్తాయి. మంగళవారం, గురువారం మరియు ఆదివారాల్లో విమానాలు నడుస్తాయి. విజ్ ఎయిర్ వెబ్ సైట్ ద్వారా టిక్కెట్ల విక్రయాలు జరుగుతాయి. మొబైల్ యాప్ ద్వారా కూడా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. 129 దిర్హాముల నుంచి టిక్కెట్ల ధరలు ప్రారంభమవుతాయి. జనవరిలో తమ సేవలు ప్రారంభమైనప్పటినుంచి 32 డెస్టినేషన్లకు విమాన సేవలు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. కేవలం గంట సమయంలోనే బహ్రెయిన్ చేరుకోవచ్చు అబుధాబి నుంచి. కాగా, 2021 నాటికి 300 మంది పైలట్లను నియమించనున్నామనీ, 2030 నాటికి 4,600 మంది పైలట్లను హైర్ చేసుకుంటామని సంస్థ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com