దళితబంధు రూ.10 లక్షలతో పథకాలు..
- August 11, 2021
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్మాతకంగా తలపెట్టిన దళితబంధు పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించిన విషయం తెలిసిందే. అయితే వీటితో ఏం చేయవచ్చో ప్రభుత్వమే చొరవ తీసుకుని కొన్ని పథకాల జాబితా ప్రవేశ పెట్టింది. గ్రామాలు, గ్రామాలు-ఉప పట్టణాలు, గ్రామాలు-పట్టణాలు, పట్టణాలు ఇలా నాలుగు రకాలుగా విభజించి జాబితాను రూపొందించింది. గతంలో ఉన్న ప్రభుత్వ పథకాలకు భిన్నంగా ఆ జాబితా ఉంది. వీటితో పాటు మరిన్ని అంశాలను కూడా ఇందులో చేర్చనుంది.
వాసాల మర్రిలో పథకం ప్రారంభమైనా.. పైలెట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 16న సీఎం కేసీఆర్ శాలపల్లి-ఇందిరానగర్ వద్ద దళితబంధును ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు ఈ యూనిట్లను అందజేయనున్నారు. వీటి కొనుగోళ్లకు సంబంధించిన విధివిధానాలకు ప్రభుత్వం ఒకటీ రెండు రోజుల్లో తెలియజేయనుంది.
తాజా వార్తలు
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!









