కోవిడ్ 19: అల్ హోసన్ యాప్‌కి మేజర్ అప్డేట్స్
- August 11, 2021
యూఏఈ: యూఏఈ కోవిడ్ 19 కాంట్రాక్ట్ ట్రేసింగ్ యాప్ అల్ హోసన్, పలు కొత్త ఫీచర్లను సంతరించుకున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. పిసిఆర్ టెస్ట్ రిజల్ట్ అలాగే వ్యాక్సినేషన్ స్టేటస్ ఆధారంగా గ్రీన్ పాస్ ప్రోటోకాల్ యాప్‌లో దర్శనమిస్తుంది. గ్రీన్, గ్రే మరియు రెడ్ కలర్స్‌లో యాప్ ఫీచర్స్ వుంటాయి. గ్రీన్ అంటే నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ ఇంకా చెల్లుబాటులో వుందని అర్థం. గ్రే రంగులోకి మారితే చెల్లుబాటు గడువు ముగిసిందని, రెడ్ అంటే అర్థం రిజల్ట్ పాజిటివ్ అని. ఆగస్ట్ 20 నుంచి అబుదాబీలోని ప్రముఖ పబ్లిక్ ప్రాంతాల్లోకి ప్రవేశించాలంటే వ్యాక్సిన్ పొందినవారికి మాత్రమే అనుమతి లభిస్తుంది. అల్ హోసన్ యాప్ ద్వారా తగిన ఆధారం చూపాల్సి వుంటుంది. షాపింగ్ సెంటర్స్, రెస్టారెంట్లు, కేఫ్‌లు, జిమ్‌లు, రిక్రియేషనల్ ఫెసిలిటీస్, స్పోర్టింగ్ యాక్టివిటీస్, రిటెయిల్ ఔట్‌లెట్స్ వంటివాటిల్లోకి ప్రవేశించాలంటే గ్రీన్ స్టేటస్ తప్పనిసరి. సూపర్ మార్కెట్లు మరియు ఫార్మసీలకు వెసులుబాటు కల్పించారు. అల్ హోసన్ యాప్ ద్వారా వ్యాక్సినేషన్ సమాచారం, సర్టిఫికెట్, ట్రావెల్ హిస్టరీ లైవ్ క్యు ఆర్ కోడ్ ప్రదర్శితమవుతాయి. త చిన్నారులు, తల్లిదండ్రుల్ని కూడా వినియోగదారులు యాప్‌లో యాడ్ చేయవచ్చు. ఎమిరేట్ ఐడీ, యునిఫైడ్ ఐడీ మరియు ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వొచ్చు.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్‌పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









