460 నుంచి 129కి తగ్గిన కోవిడ్ ఐసీయూ పేషెంట్లు
- August 12, 2021
ఒమన్: ఐసీయూలో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్ల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని ఒమన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషెంట్ల సంఖ్య 129కి తగ్గిందని మంత్రి తెలిపారు. మొన్నటి వరకు 460 మంది ఐసీయూలో ఉన్నారని అన్నారు. ఐసీయూ పేషెంట్ల కోసం 2,064 మంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారని అన్నారు. కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందించటంలో ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపడుతున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.మహమ్మారి కమ్ముకొచ్చిన తొలి నాళ్లలో తమకు కేవలం 148కి ఐసీయూ బెడ్లు మాత్రమే ఉన్నాయన్నారు.కానీ, ఇప్పుడు అంతకు ఎన్నో రెట్లు ఎక్కువ సంఖ్యలో ఐసీయూ బెడ్లను అందుబాటులోకి తెచ్చామన్నారు.ఇదిలాఉంటే గత రెండు రోజుల్లో ఒమన్‌లో కొత్తగా 476 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 22 మంది ఆస్పత్రిలో చేరారు. కోవిడ్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో 20 మంది చనిపోయారు.
తాజా వార్తలు
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ







