దుబాయ్ లో "గల్ఫ్" పాట, టీజర్ ఆవిష్కరణ!
- March 13, 2016
గల్ఫ్ కు వలస వచ్చిన భారతీయుల విజయ గాధల సమాహారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'గల్ఫ్'. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యెక్కలి రవీంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.గల్ఫ్ దేశాల్లో చాలా మందిని కలిసి వారి నుండి సమాచారాన్ని సేకరించడంతో పాటు 500 కేస్ స్టడీస్ తో యదార్ధ ఘటనల ఆధారంగా ఈ కధ తయారు చేసుకున్నారు. ప్రవీణ్ ఇమ్మడి స్వరపరిచిన ఈ చిత్రానికి సంబంధించిన పాటల్లో ఒక పాటను, టీజర్ ను శనివారం దుబాయ్ లో ఆవిష్కరించారు. గల్ఫ్ వలసల మీద రూపొందిస్తున్న సినిమా కావడంతో దుబాయ్ లోని జజీరా ఎమిరేట్స్ పవర్ అనే ప్రముఖ కంపెనీ కి చెందిన సోనాపూర్ అనే లేబర్ క్యాంపు లో ఈ వేడుక నిర్వహించారు. జజీరా ఎమిరేట్స్ పవర్ మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్ బాబు, బీటెక్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరాం, గల్ఫ్ లో అడ్వకేట్ గా పనిచేస్తున్న అనురాధ, 'మాగల్ఫ్.కామ్' నిర్వాహకులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సినిమాలో కధానాయకుడు, నాయికలుగా కొత్తవారు నటిస్తుండగా ఇతర పాత్రల్లో తనికెళ్ళ భరణి, ఎల్.బి.శ్రీరాం, నాగినీడు, జబర్దస్త్ వేణు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై లో విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్.వి.శివరాం, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి.బాపిరాజు.
















తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







