సింగపూర్ తెలుగువారిచే భారత స్వాతంత్ర్య దిన వజ్రోత్సవ వేడుకలు
- August 14, 2021
సింగపూర్: "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్ ఆధ్వర్యంలో భారతదేశ 75వ స్వాతంత్ర్య దిన వజ్రోత్సవ సందర్భంగా శనివారం సాయంత్రం "జయ ప్రియ భారత జనయిత్రీ" అనే చక్కటి కార్యక్రమం నిర్వహించబడింది.ప్రఖ్యాత సినీ గేయ రచయిత,18 సంవత్సరాలు భారత వాయుదళంలో సేవలందించిన భువనచంద్ర, ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొని అందరికీ చక్కటి ప్రోత్సాహం అందిస్తూ ప్రతి పాటను తనదైన శైలిలో వ్యాఖ్యానించి ఆశీస్సులు అందించారు.సింగపూర్ లో నివసించే 32 మంది గాయనీ గాయకులు కవులు పిల్లలు అందరూ కలిసి మాతృభూమిని కీర్తిస్తూ చక్కటి దేశభక్తి గీతాలు కవితలను వినిపించి భారతమాతకు సంగీత సాహిత్య నీరాజనాలు అర్పించారు.
భువనచంద్ర మాట్లాడుతూ "దూర దేశాల్లో ఉన్న "శ్రీ సాంస్కృతిక కళాసారథి" వంటి సంస్థలు పిల్లలు పెద్దలతో కలిసి కూర్చుని ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని, ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది దేశ నాయకులను అమరవీరులను తలుచుకునే అవకాశం లభించిందని, అందరూ వారిని మరచిపోతున్న సమయంలో భావితరాలకు కూడా తెలియజేసే విధంగా మహనీయుల ఘనతను పాటల కవితల రూపంలో అందించడం చాలా ఆనందంగా ఉందని" తెలియజేశారు.రెండు రోజులలో పుట్టినరోజు జరుపుకోబోతున్న భువనచంద్ర కి సంస్థ సభ్యులందరూ ఈ వేదిక మాధ్యమంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ "మాతృభూమికి దూరంగా ఉన్న వేళ, 75వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, అందరూ కలిసి ఒక సాయంత్రం దేశమాతని స్తుతిస్తూ ఆనందంగా కలసి గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని,ఈ మాధ్యమం ద్వారా సింగపూర్ లో ఉండే పిల్లలకు, ఔత్సాహిక కవులకు, గాయనీ గాయకులకు మంచి ప్రోత్సాహం అందించే అవకాశం మా సంస్థకు లభించిందని" ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సుబ్బు వి పాలకుర్తి, పంపన సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సహకారం అందించారు.సంస్థ కార్యనిర్వాహక వర్గ సభ్యులు రాధిక మంగిపూడి, చామిరాజు రామాంజనేయులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ వర్చ్యువల్ ఈవెంట్ కి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..