విదేశాల్లో వ్యాక్సిన్ తీసుకున్న పర్యాటకులు రిజిస్ట్రేషన్ ఎలా?

- August 15, 2021 , by Maagulf
విదేశాల్లో వ్యాక్సిన్ తీసుకున్న పర్యాటకులు రిజిస్ట్రేషన్ ఎలా?

అబుధాబి: విదేశాల్లో వ్యాక్సిన్ వ్యాక్సిన్ తీసుకొని..అబుధాబిలో పర్యటించాలనుకుంటున్నారా..? అయితే..మీరు ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. అల్ హోస్న్
యాప్ లో ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ విధివిధానాలపై అబుధాబి క్లారిటీ ఇచ్చింది. సర్టిఫికెట్ ను రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే అల్ హోస్న్ యాప్ లో గ్రీన్ స్టేటస్ ఉంటుంది. యాప్ లో గ్రీన్ స్టేటస్ ఉన్నవారు మాత్రమే ఎమిరేట్ లోని కొన్ని ప్రదేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఉంటుంది. ఈ నెల 20 నుంచే ఈ కొత్త నిబంధన అమలులోకి రానుంది. అల్ హోస్న్ యాప్ లో వ్యాక్సిన్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి అబుధాబి చేసిన సూచనలు.

అబుధాబికి బయలుదేరే ముందు:-
- సందర్శకులు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ (ICA) యాప్ లోని అరవైల్ సెక్షన్ లో రిజిస్టర్ చేసుకోవాలి.
- రిజిస్టర్ అరైవల్ ఫారమ్‌ను పూర్తి చేయాలి.
- ఆ తర్వాత ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ను అప్‌లోడ్ చేయాలి.
- ఈ ప్రక్రియ మొత్తం పూర్తవగానే అల్ హోస్న్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి SMS ద్వారా ఓ లింక్ వస్తుంది.

అబుధాబి చేరుకున్న తర్వాత:-
- అబుధాబి చేరుకున్న పర్యాటకులకు విమానాశ్రయంలో, ICA యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా సందర్శకులు యునిఫైడ్ ఐడెంటీ నంబర్ (UID) కేటాయిస్తారు.
- ఆ తర్వాత అల్ హోస్న్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది.UID నెంబర్ గానీ, ఐసీఏకి ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారాగానీ వన్ టైం పాస్ వర్డ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
- అల్ హోస్న్ యాప్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవగానే వారి ఆరోగ్య పరిస్థితి, టీకా సమాచారం, పీసీఆర్ టెస్ట్ రిపోర్టులు అన్ని క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు.వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే అబుధాబిలోని కొన్ని పబ్లిక్ ప్రాంతాల్లోకి ఎంట్రీ ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com