తాలిబన్లకు లొంగిపోయిన ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం..

- August 15, 2021 , by Maagulf
తాలిబన్లకు లొంగిపోయిన ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం..

ఆఫ్ఘనిస్థాన్: ఆఫ్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబ‌న్ల గుప్పట్లోకి వెళ్లిపోయింది. ఇప్పటికే దేశంలోని 19 రాష్ట్రాల్లో పాగా వేసిన తాలిబన్లు తాజాగా దేశ రాజధాని కాబూల్ ల్లోకి ప్రవేశించారు. అఫ్గానిస్తాన్ దేశ అన్ని సరిహద్దులను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని రాజీనామా ప్రకటించారు. అనంతరం తాలిబన్లకు అధికారం అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు అఫ్ఘాన్ నుంచి హెలికాప్టర్ల ద్వారా తమ రాయబార కార్యలయ సిబ్బందిని అమెరికా తరలిస్తోంది. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్న 15వందల మంది భారత పౌరులను భారత్‌కు తిరిగి రావాలని విదేశాంగశాఖ అడ్వైజరీ జారీ చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com