అషురా సెలవు రోజుల్లో ఆరేంజ్ ఆలర్ట్

- August 16, 2021 , by Maagulf
అషురా సెలవు రోజుల్లో ఆరేంజ్ ఆలర్ట్

బహ్రెయిన్: బహ్రెయిన్ వ్యాప్తంగా ఈ నెల 18-19 తేదీల్లో ఆరేంజ్ అలర్ట్ విధించనున్నట్లు కోవిడ్ -19ని ఎదుర్కోవటానికి ఏర్పాటైన నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ వెల్లడించింది. అషురా సెలవు రోజులు ఉండటంతో ఆరేంజ్ అలర్ట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి అవసరమైతే కొన్ని తేదీలను హైయర్ అలర్ట్ లెవల్స్ ప్రకటించొచ్చన్న మునుపటి ప్రకటనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ నెల 20 శుక్రవారం నుంచి తిరిగి ఎల్లో అలర్ట్ లెవల్ అమలులోకి వస్తుందని తెలిపింది.అర్హత ఉన్న 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో కనీసం 80% మంది బూస్టర్ డోస్ అందుకున్న తర్వాత అతి తక్కువ హెచ్చరిక స్థాయి అమలులోకి వస్తుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com