రమ్య హత్య: నిందితుడి తల్లి సంచలన వ్యాఖ్యలు

- August 16, 2021 , by Maagulf
రమ్య హత్య: నిందితుడి తల్లి సంచలన వ్యాఖ్యలు

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు కాకానిలో నడిరోడ్డుపై బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటన అనంతరం పోలీసులు ఇప్పటికే నిందితుడు శశికృష్ణను అరెస్టు చేశారు. రమ్య హత్య అనంతరం ప్రభుత్వంపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో రమ్యను అత్యంత కిరాతకంగా హత్యచేసిన నిందితుడు శశికృష్ణ తల్లి స్పందించారు.శశికృష్ణ చేసిన పనికి తగిన శాస్తి జరగాల్సిందేనని ఆమె అభిప్రాయం వ్యక్తంచేశారు. తన కొడుకు ఆ అమ్మాయిని చంపటం తప్పేనని.. అలా చేయడం కరెక్ట్ కాదంటూ పేర్కొ్ంది. ఈ ఘటన పట్ల తాను బాధపడుతున్నట్లు వెల్లడించింది. వాళ్లిద్దరి పరిచయం గురించి తనకు తెలియదని వెల్లడించింది. ఎవరి బిడ్డైనా ఒకటేనని.. వాళ్లిద్దరి పరిచయం గురించి తనకు తెలియదని వెల్లడించింది. అతను చేసిన పనికి తగిన శాస్తి జరగాల్సిందేనని నిందితుడి తల్లి పేర్కొంది. ఈ మధ్య శశికృష్ణ తనలో తాను బాధపడుతూ ఎందుకో కుమిలిపోతున్నాడని తెలిపింది. ఒంటరిగా ఉండటం.. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంటున్నాడని అభిప్రాయపడింది. ఇలా చేసిన తన కుమారుడికి తగిన శాస్తి జరగాల్సిందేనని స్పష్టం చేసింది.

ఇదిలాఉంటే.. రమ్య మృతదేహాన్ని ఇంటికి తరలించే క్రమంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రికత్త నెలకొంది. వాహనాన్ని అడ్డుకుని పలు పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో రమ్య మృతదేహాన్ని జీజీహెచ్‌ నుంచి తరలించకుండా అడ్డుకున్నారు. కాగా.. విపక్షాల ఆందోళన నేపథ్యంలో మృతదేహాన్ని మరో మార్గం నుంచి స్వగ్రామానికి తరలించారు. కాగా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేతలు నారా లోకేష్, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, దూళిపాళ నరేంద్రలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com