విమాన చక్రాల నుండి పడిపోయి ఇద్దరు మృతి

- August 16, 2021 , by Maagulf
విమాన చక్రాల నుండి పడిపోయి ఇద్దరు మృతి

కాబూల్‌: ఆఫ్గానిస్తాన్‌లో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశం తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్లిపోవడంతో ప్రజలు తమ ప్రాణాలను అరి చేతుల్లో పెట్టుకుని బతుకున్నారు. ఎప్పుడు ఎటు నుండి ఏ విపత్తు ముంచెత్తుకొస్తుందో తెలియని ఆందోళనల్లో ఉన్నారు. దీంతో దేశం నుండి పారిపోయేందుకు ప్రజలు విమానాశ్రయాలకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ప్రజలతో కిక్కిరిసి పోతున్నాయి. విమానాలు కూడా అధిక సంఖ్యలో లేకపోవడంతో .. తదుపరి సర్వీసు కోసం అక్కడే పడిగాపులు కాస్తున్నారు.తాజాగా కాబూల్‌ విమానాశ్రయంలో జన సందోహం అధికంగా ఉండటంతో భద్రతా దళాలు కాల్పులు జరపగా..ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే హృదయ విదాకర ఘటన మరోటి చోటుచేసుకుంది. ఆఫ్గాన్‌ నుండి పారిపోయిందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు విమానంలో ఖాళీ లేక..మరో అవకాశం లేకే విమానం చక్రాలకు తమను తాము కట్టుకున్నారు. కాబూల్‌ నుండి విమానం ఒక్కసారిగా గగనతలంలోకి ఎగరగానే...వీరిద్దరూ ఒక్కసారిగా నేలపై పడిపోవడం వీడియోలో కన్పిస్తుంది.కాగా, వీరిద్దరూ చనిపోయినట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com