వెల్‌క్యూబ్ వద్ద భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

- August 16, 2021 , by Maagulf
వెల్‌క్యూబ్ వద్ద భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

దుబాయ్: జుమైరా విలేజ్ ట్రయాంగిల్ వద్ద చేపడుతున్న హొటల్ ప్రాజెక్టు ప్రాంతంలో వెల్ క్యూబ్ సంస్థ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని నిర్వహించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో భారతీయులు సంబరాలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా, హోటల్ ప్రాజెక్టు 40 అంతస్థులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోనుంది. దుబాయ్ నివాసానికి అత్యంత అనువుగా అత్యంత ఆరోగ్యకరంగా ఉండాలన్న కోణంలో పలు కీలక ప్రాజెక్టులను హాస్పిటాలిటీ రంగంలో రూపొందిస్తున్నారు.షేక్ మొహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మార్గదర్శకాలతో ఈ ప్రాజెక్టులు రూపొందుతున్నాయి. కాగా, భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వైస్ కౌన్సిల్ ఆనంద్ కుమార్ పిసిపాటి, జయన్ సేవా మిషన్ ప్రెసిడెంట్ చేతన్ కరణీ తదితరులు పాల్గొన్నారు.యూఏఈ జాతీయ గీతం ఆలాపనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

భారత జాతీయ గీతాన్ని 120 మంది ఔత్సాహిక కార్మికులు, ఇతరులు ఆలపించారు.జెజి గ్రూపు చైర్మన్ రాజేష్ జైన్ ఆహుతుల్ని ఆహ్వానించారు.కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రవాసి భారతీయ సహాయతా కేంద్ర ప్రతినిధి అనీష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులకు ఏమైనా సమస్యలు వస్తే, కాన్సులేట్‌ని ఎలా సంప్రదించాలన్న విషయాన్ని తెలియజేశారు.ఈస్టర్ హాస్పిటల్స్ ద్వారా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కార్మికుల కోసం మెడికల్ క్యాంపును దుబాయ్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. గుండె పోటు వంటి సమస్యల విషయమై కార్మికులకు ఆసుపత్రి సిబ్బంది కార్మికులకు అవగాహన కల్పించారు. యోగా గురువు డాక్టర్ విశ్వాస్ యోగాసనాలపై అవగాహన కల్పించారు.సైబర్ దాడులు వంటి వాటి విషయమై ఎలా జాగ్రత్తగా ఉండాలి, సమస్యలు లేకుండా మనీ ట్రాన్స్‌ఫర్ ఎలా చేయాలి.? అన్న విషయాలపై బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు కార్మికులకు అవగాహన కల్పించారు. కార్మికులకు స్వీట్లు పంచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com