టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల

- August 17, 2021 , by Maagulf
టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల

దుబాయ్‌: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం ఐసీసీ విడుదల చేసింది. యూఏఈ, ఒమన్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌ 17వ తేదీ నుంచి నవంబర్‌ 14వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఫైనల్ వేదికగా దుబాయ్‌ని నిర్ణయించారు. 

రౌండ్ 1 గ్రూప్ బీలో ఆతిథ్య ఒమన్, పపువా న్యూగినియాల మధ్య మ్యాచ్‌తో అక్టోబర్ 17న మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. రౌండ్‌ 1లో భాగంగా గ్రూప్ ఏ లో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నబీబియా జట్లు ఉన్నాయి. గ్రూప్ బి లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ జట్లు ఉన్నాయి. క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల అనంతరం ఒక్కో గ్రూప్ నుంచి రెండేసి జట్లు టీ20 వరల్డ్ కప్‌నకు అర్హత సాధిస్తాయి. 

అక్టోబర్‌ 23న ఆస్ట్రేలియా,దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న మ్యాచ్‌తో సూపర్‌ 12 లీగ్‌ స్టేజీ మ్యాచ్‌లు మొదలవనున్నాయి. ఇక సూపర్‌ 12లో గ్రూఫ్‌ 2లో ఉన్న భారత్‌.. అక్టోబర్‌ 24న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో, అక్టోబర్‌ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్‌ 3న అఫ్గనిస్తాన్‌తో, నవంబర్‌ 5న బి1 క్వాలిఫయర్‌తో, నవంబర్‌ 8న ఏ1 క్వాలిఫయర్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. నవంబర్‌ 10,11 తేదీల్లో సెమీ ఫైనల్స్‌, నవంబర్‌ 14వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com