12 నుంచి 15 ఏళ్ళ లోపు వయసున్న 90,000 మంది చిన్నారులకు వ్యాక్సినేషన్
- August 17, 2021
కువైట్: జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ల ద్వారా కమ్యూనిటీ ఇమ్యూనిటీ పెంచే దిశగా ఒమన్ అత్యంత వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. 12 నుంచి 15 ఏళ్ళ మధ్య వయసున్న 90,000 మంది చిన్నారులకు ఒక డోసు లేదా రెండు డోసులు అందించినట్లు అధికారులు తెలిపారు. 110,000 మంది పిల్లలు ఈ గ్రూపులో వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొత్తం టార్గెట్ గ్రూపు చిన్నారుల సంఖ్య 280,000 కాగా, అందులో 40 శాతం మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల్లో వ్యాక్సినేషన్ చేస్తున్నారు. అక్టోబర్ 3 నుంచి స్కూళ్ళు తెరచుకోనున్న నేపథ్యంలో ఈలోగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







