విదేశాల్లో తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్లు యూఏఈలో చెల్లుబాటవుతాయన్న ఎతిహాద్
- August 17, 2021
యూఏఈ: ఆగస్ట్ 20 నుంచి విదేశాల్లో తీసుకున్న కోవిడ్ వ్యాక్సన్లకూ గుర్తింపు వుంటుందని అబుదాబీకి చెందిన ఎతిహాద్ ఎయిర్ వేస్ వెల్లడించింది. సినోఫామ్, సినోవాక్, జన్స్సెన్, ఫైజర్, స్పుత్నిక్ వి, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రా జెనకా మరియు మోడెర్నా ఈ లిస్టులో వున్నాయి. ప్రయాణానికి ముందు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ మరియు సిటిజన్షిప్ నుంచి ఆన్లైన్ ద్వారా అనుమతి పొందాల్సి వుంటుంది. ఇండియా, పాకిస్తాన్ తదితర దేశాలపై నిషేధం వున్న దరిమిలా, వాటికి ఈ వెసులుబాటు వర్తిస్తుందా.? లేదా.? అన్నదానిపై స్పష్టత లేదు. అల్హోస్న్ యాప్ ద్వారా గ్రీన్ స్టేటస్ పొందేవారికి ఆగస్టు 20 నుంచి ఈ ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తారు. గ్రీన్ లిస్టు దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు (వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులు) తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ (నెగెటివ్) తీసుకురావాలి. వచ్చిన రోజు, ఆ తర్వాత ఆరవ రోజున టెస్టులు నిర్వహిస్తారు. వేరే డెస్టినేషన్ల నుంచి వచ్చేవారు క్వారంటైన్ పాటించాలి. వారికి ఆరవ రోజున పీసీఆర్ టెస్ట్ చేస్తారు.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







