విదేశాల్లో తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్లు యూఏఈలో చెల్లుబాటవుతాయన్న ఎతిహాద్

- August 17, 2021 , by Maagulf
విదేశాల్లో తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్లు యూఏఈలో చెల్లుబాటవుతాయన్న ఎతిహాద్

యూఏఈ: ఆగస్ట్ 20 నుంచి విదేశాల్లో తీసుకున్న కోవిడ్ వ్యాక్సన్లకూ గుర్తింపు వుంటుందని అబుదాబీకి చెందిన ఎతిహాద్ ఎయిర్ వేస్ వెల్లడించింది. సినోఫామ్, సినోవాక్, జన్‌స్సెన్, ఫైజర్, స్పుత్నిక్ వి, ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రా జెనకా మరియు మోడెర్నా ఈ లిస్టులో వున్నాయి. ప్రయాణానికి ముందు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ మరియు సిటిజన్‌షిప్ నుంచి ఆన్‌లైన్ ద్వారా అనుమతి పొందాల్సి వుంటుంది. ఇండియా, పాకిస్తాన్ తదితర దేశాలపై నిషేధం వున్న దరిమిలా, వాటికి ఈ వెసులుబాటు వర్తిస్తుందా.? లేదా.? అన్నదానిపై స్పష్టత లేదు. అల్‌హోస్న్ యాప్ ద్వారా గ్రీన్ స్టేటస్ పొందేవారికి ఆగస్టు 20 నుంచి ఈ ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తారు. గ్రీన్ లిస్టు దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు (వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులు) తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ (నెగెటివ్) తీసుకురావాలి. వచ్చిన రోజు, ఆ తర్వాత ఆరవ రోజున టెస్టులు నిర్వహిస్తారు. వేరే డెస్టినేషన్ల నుంచి వచ్చేవారు క్వారంటైన్ పాటించాలి. వారికి ఆరవ రోజున పీసీఆర్ టెస్ట్ చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com