డల్లాస్లోని గాంధీ మెమోరియల్ వద్ద 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- August 17, 2021
డాలస్: మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో అమెరికాలోనే అతి పెద్దదైన డాలస్ లో నెలకొని ఉన్న గాంధీ మెమోరియల్ దగ్గర 75 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆగష్టు 15న కోవిడ్ నిభందనలకు లోబడి అత్యంత ఉత్సాహంగా పాల్గొన్న ప్రవాస భారతీయుల మధ్య ఘనంగా జరిగాయి.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక ఛైర్మన్ డా.ప్రసాద్ తోటకూర పిల్లలు,పెద్దల కేరింతల మధ్య భారత జాతీయ పతాకావిష్కరణ చేసి, మహాత్మాగాంధీకి పుష్పాంజలి ఘటించారు.డా.తోటకూర మాట్లాడుతూ గాంధిజీ తో సహా ఎంతోమంది జాతీయ నాయకులు,స్వాతంత్ర్య యోధుల త్యాగ ఫలితంగా సాధించికున్న 75 సంవత్సారాల స్వాతంత్ర్య భారతంలో మనం అనేక రంగాలలో ఎంతో ప్రగతి సాధించినా, ఇప్పటికే కొన్ని వేల గ్రామాలల్లో కనీస వసతులైన మంచి నీరు, విద్యుత్, విద్యా, వైద్య సదుపాయాలు లేకపోవడం శోచనీయం అన్నారు.చిత్తశుద్ధితో పాలకులు, అంకిత భావంతో ప్రజలు కలసి పనిచేస్తే తప్ప ఆశించిన అభివృద్ధి సాధించలేమన్నారు.విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు భారత దేశాభివృద్ధిలో తమ వంతు కృషితో పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల, బోర్డు సభ్యులు, కమ్యూనిటీ నాయకులు ఉర్మీత్ జునేజా, సల్మాన్ ఫర్షోరి,దినేష్ హూడా,షబ్నం మోడ్గిల్, ఎం.వి.ఎల్ ప్రసాద్, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, పులిగండ్ల విశ్వనాధం, ములుకుట్ల వెంకట్ లు, పిల్లలు పెద్దలు చిరు జల్లుల మధ్య గాంధీజీకి నివాళులర్పించి, మిటాయిలు తింటూ ఆహ్లాదంగా గడిపారు.


తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







