ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు..
- August 17, 2021
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ స్టేషన్లు/యూనిట్లలో వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా గ్రూప్ సీ సివిలియన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు లాంటి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
- నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 197 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- ఇందులో సూపరింటెండెంట్, ఎంటీఎస్, ఎల్‌డీసీ, స్టోర్ కీపర్,కార్పెంటర్, టెయిలర్, ట్రెడ్స్‌మెన్ మెట్ వంటి పోస్టులున్నాయి.
- పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తుచేసుకునే అభ్యర్థులు సంబంధిత పోస్టును అనుసరించి.. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో నైపుణ్యంతోపాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
- అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
- ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని సంబంధిత వివరాలను ఎంటర్ చేయాలి.
- అనంతరం దరఖాస్తును వివిధ రాష్ట్రాల్లో ఉన్న సంబంధిత ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో అందించాలి.
- అభ్యర్థులను పోస్టులను అనుసరించి రాతపరీక్ష, స్కిల్/ఫిజికల్/ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
- దరఖాస్తుల స్వీకరణకు 07.09.2021 ని చివరి తేదీగా నిర్ణయించారు.
మరిన్ని వివరాల కోసం https://indianairforce.nic.in/ ఈ లింకు క్లిక్ చెయ్యండి.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







