తాలిబన్ ప్రతినిధులతో ఖతార్ విదేశాంగ శాఖ మంత్రి భేటీ
- August 18, 2021
దోహా: అఫ్గాన్ శాంతి, రాజకీయ సుస్థిరత కోసం ఖతార్ తమ వంతు ప్రయత్నాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్ నేతృత్వంలోని తాలిబాన్ ప్రతినిధి బృందంతో ఖతార్ ఉప ప్రధాని& విదేశాంగ మంత్రి షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ తానీ సమావేశమయ్యారు. అఫ్గానిస్తాన్ లో ప్రజల భద్రత, తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించారు. అఫ్గాన్ పౌరుల రక్షణ, జాతీయ సయోధ్యకు అవసరమైన తక్షణ చర్యలు ముమ్మరం చేయటం, అలాగే సమగ్ర రాజకీయ పరిష్కారం కోసం శాంతియుతంగా అధికార మార్పిడి కోసం జరగాల్సిన అవసరంపై చర్చించారు. అఫ్గాన్ ప్రజలు ఇన్నాళ్లుగా సాధించుకున్న అభివృద్ధి ఫలాలను అస్వాదించేలా, వారి ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రాముఖ్యతపై కూడా ఖతార్ మంత్రి తాలిబన్ ప్రతినిధులతో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







