అబుధాబి: పీసీఆర్ టెస్ట్ ఫీజులను సవరించిన ఆరోగ్యశాఖ

- August 18, 2021 , by Maagulf
అబుధాబి: పీసీఆర్ టెస్ట్ ఫీజులను సవరించిన ఆరోగ్యశాఖ

 అబుధాబి: కోవిడ్ నిర్ధారణ పరీక్షలు పీసీఆర్ టెస్ట్ ఛార్జీలను సవరిస్తూ అబుధాబి అబుదాబి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ (DoH) ప్రకటన విడుదల చేసింది. సాధారణ పీసీఆర్ టెస్ట్ ఛార్జ్ ను AED 65గా ఫిక్స్ చేసింది. అయితే..అత్యవసర పరిస్థితుల్లో తక్కువ సమయంలోనే రిపోర్ట్ పొందే వారికి విడివిడిగా ధరలను నిర్ణయించింది. ఒకటి నుండి రెండు గంటలలోపు ఫలితాల కోసం AED 350 చెల్లించాల్సి ఉంటుంది. అదే రెండు నుండి ఐదు గంటల్లో ఫలితాల పొందాలనుకంటే AED 250 గా పీసీఆర్ ధరలను ఫిక్స్ చేసింది. ఇక ఇంటి దగ్గరే పీసీఆర్ టెస్ట్ చేయించాలనుకుంటే హెల్త్ కేర్ సెంటర్లను సంప్రదించాలని..వారికి అదనపు రుసుము వర్తిస్తుందని పేర్కొంటూ డిఓహెచ్ వివరించింది. ఇదిలాఉంటే ఎలాంటి లక్షణాలు లేకున్నా టెస్ట్ చేయించుకోవాలనుకుంటే వారి సొంత ఖర్చుతోనే టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. లక్షణాలు ఉంటే మాత్రం టెస్ట్ ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com