ట్యాక్సీ డ్రైవర్‌కి డబ్బు చెల్లించకుండా, వేలు విరగ్గొట్టిన ప్రయాణీకుడు

- August 18, 2021 , by Maagulf
ట్యాక్సీ డ్రైవర్‌కి డబ్బు చెల్లించకుండా, వేలు విరగ్గొట్టిన ప్రయాణీకుడు

బహ్రెయిన్: ఓ ప్రయాణీకుడు, ట్యాక్సీ డ్రైవర్‌కి చెల్లించాల్సిన సొమ్ము చెల్లించకపోగా, వాగ్యుద్ధానికి దిగి, అతని మీద దాడి చేసి, అతని చేతి వేలిని విరగ్గొట్టేశాడు. ఈ ఘటనలో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి న్యాయస్థానం మూడు నెలల జైలు శిక్ష విధించింది. అనంతరం అతన్ని దేశం నుంచి బహిష్కరిస్తారు. 3 బహ్రెయినీ దినార్లను నిందితుడు, తాను వినియోగించిన ట్యాక్సీ కోసం ట్యాక్సీ డ్రైవర్‌కి చెల్లించాల్సి వుండగా, నిందితుడు అతనిపై దాడికి దిగాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com