యూఏఈ: 2021లో పెరిగిన విపిఎన్ డౌన్‌లోడ్స్, దుర్వినియోగం చేస్తే 2 మిలియన్ దిర్హాముల జరీమానా

- August 18, 2021 , by Maagulf
యూఏఈ: 2021లో పెరిగిన విపిఎన్ డౌన్‌లోడ్స్, దుర్వినియోగం చేస్తే 2 మిలియన్ దిర్హాముల జరీమానా

యూఏఈ: వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. విపిఎన్ అప్లికేషన్ డౌన్‌లోడ్స్ 2021లో చాలా పెరిగిందనీ, 2020తో పోల్చితే ఈ పెరుగుదల చాలా ఎక్కువని అధికారులు చెబుతున్నారు. అమెరికాకి చెందిన అట్లాస్ విపిఎన్ వెల్లడించిన వివరాల ప్రకారం 2021 తొలి అర్థ భాగంలో ప్రపంచ వ్యాప్తంగా విపిఎన్ అందిపుచ్చుకున్న దేశాల్లో యూఏఈ ముందు వరుసలో వుందని తెలుస్తోంది. 3.9 మిలియన్ విపిఎన్ అప్లికేషన్లు డౌన్‌లోడ్ అయ్యాయి 2021 తొలి అర్థ భాగంలో. ఖతార్ ఈ విభాగంలో 44.47 శాతంతో ముందంజలో వుంది. రెండో స్థానంలో యూఏఈ (39.91 శాతం) నిలిచింది. ఇండియాలో 25.27 శాతం మంది విపిఎన్ వినియోగిస్తున్నారు. 2020లో యూఏఈ మొదటి స్థానంలో నిలిచింది. 61.61 శాతం యూఏఈ జనాభా విపిఎన్ డౌన్‌లోడ్ చేసుకోవడం జరిగింది. కాగా, సింగిల్ యూసేజ్ విపిఎన్ గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. కాగా, నిబంధనల్ని అనుసరించి విపిఎన్ వినియోగిస్తే ఎలాంటి సమస్యా వుండదు. నిబంధనల్ని అతిక్రమిస్తే మాత్రం 500,00 దిర్హాములకు తక్కువ కాకుండా 2 మిలియన్ దిర్హాముల వరకు జరీమానా విధించే అవకాశం వుంటుంది. తాత్కలిక జైలు శిక్ష కూడా విధిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com