పరారీపై క్లారిటీ: అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు ఘనీ తొలి వీడియో మెసేజ్
- August 19, 2021
యూఏఈ: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ తాలిబన్ల వశం కాగానే దేశం విడిచి పారిపోయిన మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తాను ఏ పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందో వివరిస్తూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశంలో రక్తపాతాన్ని నివారించటానికే తాను కాబూల్ విడిచిపెట్టానని ఆయన అన్నారు. పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని పారిపోయినట్లు వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తాను డబ్బుతో పారిపోలేదని, తాలిబన్లు కాబూల్ ను ఆక్రమించుకునే సమయంలో తాను అక్కడే ఉంటే పెద్ద ఎత్తున రక్తపాతాన్ని చూస్తూ ఉండేంవాడినని అన్నారు. ఆ దారుణాలను చూడకూడదనే దేశం విడిచి వచ్చానంటూ వివరణ ఇచ్చారు. ప్రభుత్వ అధికారుల సలహా మేరకే కాబూల్ ను వదిలి వచ్చినట్లు తెలిపారు. తాలిబన్లు కాబూల్ ఆక్రమించుకుంటున్న సమయంలో హఠాత్తుగా దేశం విడిచి వెళ్లినందుకు ఘనీపై మాజీ మంత్రులు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఘనీ తమని, దేశ ప్రజల్ని మోసం చేశారంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన యూఏఈ నుంచి ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా వివరణతో కూడిన వీడియో మెసేజ్ ను విడుదల చేశారు. ఘనీ యూఏఈలో ఉన్నారని బయటి ప్రపంచానికి తెలిసిన తర్వాత తాన మొదటి బహిరంగ వ్యాఖ్యలు ఇవే.
తాజా వార్తలు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!







