జీతాల కోసం 300 మంది వ్యవసాయ కార్మికుల ఆందోళన

- August 19, 2021 , by Maagulf
జీతాల కోసం 300 మంది వ్యవసాయ కార్మికుల ఆందోళన

కువైట్: చేసిన కష్టం వెట్టిచాకిరిగా మారుతోందని, జీతాలు కూడా ఇవ్వటం లేదంటూ దాదాపు 300 మంది వ్యవసాయ కార్మికులు ఆందోళన పాట పట్టారు. కువైట్లోని అబ్దాలీ ఫార్మ్ దగ్గర వీరంతా నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న అంతర్గత మంత్రిత్వ శాఖ సిబ్బంది..హింసాత్మక ఘటనలకు ఆస్కారం ఇవకుండా ముందుజాగ్రత్తగా  సంఘటనా స్థలానికి చేరుకుంది. దీంతో వ్యవసాయ కార్మికులు తమ గోసను అధికారుల ముందు వెల్లబోసుకున్నారు. చాకిరి చేయించుకొని జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు..కనీస వసతులు కూడా లేవని, దుర్భర పరిస్థితుల్లో తాము బతుకీడుస్తున్నామని అక్కడి పరిస్థితులను వివరించారు. వ్యవసాయ కార్మికులు గోడు విన్న అంతర్గత మంత్రిత్వ శాక సిబ్బంది..కంపెనీ అధికారులతో మాట్లాడి బకాయి జీతాలు చెల్లించేలా ఒప్పించింది. జీతాలు చెల్లిస్తామంటూ కంపెనీ ప్రతినిధుల నుంచి హామీ రావటంతో వ్యవసాయ కార్మికులు తమ ఆందోళనను విరమించుకున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com