గల్ఫ్ వాపసీలు 'స్వదేస్' పథకాన్ని ఉపయోగించుకోవాలి
- August 19, 2021
హైదరాబాద్: వందే భారత్ మిషన్ కింద వాపస్ వచ్చిన భారతీయ పౌరుల కోసం ప్రభుత్వం 'స్వదేస్' (స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డేటాబేస్ ఫర్ ఎంప్లాయిమెంట్ సపోర్ట్ - ఉద్యోగ మద్దతుకోసం నైపుణ్య వంతులైన కార్మికుల సమాచార సేకరణ) ను భారత ప్రభుత్వం ప్రారంభించిందని, కోవిడ్ సంక్షోభంలో గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన కార్మికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీలో సభ్యులైన బాపురావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గల్ఫ్ కార్మికులకు సహాయపడుతున్నందుకు బిజెపి నాయకుడు నంగి దేవేందర్ రెడ్డి గురువారం హైదరాబాద్ లో ఎంపీని కలిసి కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించారు.
విదేశాల నుండి వాపస్ వచ్చినవారు ఆన్లైన్ లో 'స్వదేస్' స్కిల్స్ కార్డ్‌ని పూరించాలి. ఇందులో వృత్తి, నైపుణ్యం, అనుభవం వివరాలను నమోదు చేయాలి. 'స్కిల్ కార్డ్' ద్వారా సేకరించిన సమాచారం స్కిల్ ఇండియా 'అసీం'(ఆత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయీ ఎంప్లాయర్ మ్యాపింగ్) పోర్టల్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలను సులభతరం చేయడానికి ఉపయోగించబడుతుందని ఈ సందర్బంగా నంగి దేవేందర్ రెడ్డి అన్నారు.
'స్వదేస్' నైపుణ్య కార్డు కోసం గల్ఫ్ కార్మికుల పేర్లు నమోదు చేయడానికి త్వరలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని దేవేందర్ రెడ్డి అన్నారు. గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన కార్మికులకు పునరావాసం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం 'గల్ఫ్ బంధు' పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







