వ్యాక్సిన్, పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి..ప్రయాణికులకు ఒమన్ క్లారిటీ
- August 20, 2021
ఒమన్: సుల్తానేట్లో వైరస్ సంక్రమణ తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో ఆంక్షలను సడలిస్తూ వస్తున్న ఒమన్..అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా గైడ్ లైన్స్ అప్ డేట్ చేసింది. ఒమన్ కు వచ్చే 18 ఏళ్లు పైబడిన అంతర్జాతీయ ప్రయాణికులు..సుల్తానేట్ లో ఆమోదం పొందిన వ్యాక్సిన్లలో ఒకటి తప్పనిసరిగా తీసుకొని ఉండాలి. అలాగే ఒమన్ కు బయల్దేరే ముందు..ఒమన్ చేరుకున్న తర్వాత పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం పేర్కొన్న ప్రత్యేక వర్గాలు మినహా మిగిలిన అంతర్జాతీయ ప్రయాణికులు అందరూ వారం పాటు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలి. ఒకవేళ ఒమన్ చేరుకున్న చేసుకున్న పీసీఆర్ టెస్టులో పాజిటీవ్ వస్తే..ఎనిమిదవ రోజున మరోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే..ఒమన్ ట్రావెల్ బ్యాన్ లిస్టులో ఉన్న దేశాల నుంచి వచ్చే వారి విషయంలో అప్ డేట్స్ రావాల్సి ఉంది. ఇదిలాఉంటే..సుల్తానేట్లో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గటంతో రాత్రి కర్ఫ్యూను ఎత్తివేయాలని సుప్రీం కమిటీ నిర్ణయించింది. ఈ నెల 21 (శనివారం) నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. అదే సమయంలో సెప్టెంబర్ 1 నుండి వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వ సంస్థలు, షాపింగ్ మాల్‌లు, రెస్టారెంట్‌లలో ఎంట్రీకి అవకాశం ఉంటుందని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







