నేటి నుంచి ఒమన్‌లో నైట్ లాక్‌డౌన్ ఎత్తివేత

- August 21, 2021 , by Maagulf
నేటి నుంచి ఒమన్‌లో నైట్ లాక్‌డౌన్ ఎత్తివేత

ఒమన్: ఆగస్ట్ 21 నుంచి ఒమన్ సుల్తానేట్‌లో నైట్ లాక్ డౌన్ ఎత్తివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కోవిడ్ 19 కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో జన జీవనం సాధారణ స్థితికి తీసుకొచ్చే క్రమంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే, పౌరులు నివాసితులంతా కరోనా నిబంధనల్ని తప్పక పాటించాల్సి వుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఫేస్ మాస్కులు ధరించడం, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com