భారత బ్లూ-కాలర్ కార్మికుల కోసం శిక్షణ నైపుణ్యాలు
- August 21, 2021
అజ్మన్: అజ్మన్ లో ఆగస్ట్ 20న ఇండియన్ అసోసియేషన్ అజ్మన్ అలాగే క్రోమ్వెల్ యూకే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సహకారంతో భారత బ్లూ కాలర్ కార్మికులకు శిక్షణ, నైపుణ్యాలకు సంబంధించి ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికుల నైపుణ్యాలు పెంచుకునేందుకు వీలుగా శిక్షణ అందివ్వడం ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశం. ఇండియన్ అసోసియేషన్ అజ్మన్ ప్రెసిడెంట్ అబ్దుల్లా సలెహ్, క్రోమ్ వెల్ యూకే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఆపరేషన్స్ డైరెక్టర్ మొహమ్మద్ షాఫిక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూఏఈలోని భారతీయులకు నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించేందుకు ఇండియన్ ఎంబసీ పలు కార్యక్రమాల్ని నిర్వహిస్తోందని కాన్సుల్ జనరల్ పేర్కొన్నారు. జనవరి 2021 నుంచి చేపడుతున్న ఈ కార్యక్రమంలో 300 మంది వరకు భారత కార్మికులు లబ్ది పొందినట్లు తెలిపారు. మరిన్ని కార్యక్రమాలు ఇలాంటివి నిర్వహించనున్నట్లు అబ్దుల్ సలాహ్ పేర్కొన్నారు. 50 మంది భారత బ్లూ కాలర్ కార్మికులు తాజా సెషన్లో లబ్ది పొందారు.



తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







