ఆఫ్ఘనిస్తాన్ లో ఉండిపోయిన భారతీయుల కొరకు హెల్ప్ డెస్కులు ఏర్పాటు
- August 22, 2021
ఏపీ: ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉండిపోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు సురక్షితంగా వారి స్వస్థలాలకు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్మిక శాఖలో హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేసి,అధికారులను నియమించి, 0866-2436314 నంబర్ ను అందుబాటులో ఉంచినట్లు కార్మిక శాఖ కమీషనర్ జి.రేఖా రాణి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ సంస్థ APNRTS ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల కోసం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో నడుస్తుందని APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి తెలిపారు.ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నమన రాష్ట్రవాసులు స్వదేశానికి తిరిగిరావడం గురించి లేదా ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు: 0863 2340678, వాట్సాప్: 85000 27678, ఇమెయిల్: [email protected] మరియు [email protected] లను సంప్రదించగలరని తెలిపారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ లో మిగిలి ఉన్న భారతీయులు కొరకు చర్యలు ముమ్మరం చేసిందన్నారు.విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ +91-11-49016783, +91-11-49016784, +91-11-49016785 టెలిఫోన్ నంబర్లను, +91-8010611290(వాట్సాప్) మరియు ఇమెయిల్:[email protected] లతో ప్రత్యేక ఆఫ్ఘనిస్తాన్ సెల్‌ను ఏర్పాటు చేసిందన్నారు.ఈ ప్రక్రియ వేగంగా, సులువుగా జరపడానికి కార్మికశాఖకు, APNRTS కు వచ్చిన అభ్యర్థనలను దాసరి బాలయ్య కి,RPO & Head of MEA Branch Secretariat, హైదరాబాద్, టెలిఫోన్: 040-7806051/27811030,ఇమెయిల్: [email protected] ద్వారా తెలియజేసి,వారితో సమన్వయము చేసుకుంటూ, అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని వెంకట్ ఎస్. మేడపాటి అన్నారు.
తాజా వార్తలు
- CBSE అలర్ట్: గల్ఫ్ దేశాల్లో మార్చి 5, 6 తేదీల్లో జరగాల్సిన బోర్డు పరీక్షలు కూడా వాయిదా!
- అన్ని శాఖల్లో ఎఐ వినియోగం పై సీఎం చంద్రబాబు సమీక్ష
- దుబాయ్ నుంచి భారత్‌కు సురక్షితంగా చేరుకున్న పీవీ సింధు!
- 15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!
- అన్ని ఎయిర్ యాక్టివిటీస్ ను నిలిపివేసిన ఒమన్..!!
- రియాద్ లో యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడిపై సౌదీ క్లారిటీ..!!
- విదేశాలలో చిక్కుకున్న నివాసితులు..ఖర్చులపై ఆందోళన..!!









