24 మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ ..
- March 14, 2016
వైవిధ్యమైన పాత్రలతో కలెక్షన్ల సునామీ సృష్టించే హీరో సూర్య, సామాన్యుడి ఆలోచనలకు అందకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రాల్ని తెరకెక్కించే స్టామినా ఉన్న విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందించిన ప్రెస్టీజియస్ సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ 24. గ్లోబర్ సినిమాస్, 2డి ఎంటర్ టైన్ మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజా సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రంలోని మొదటి పాటను ఈరోజు విడుదల చేశారు. ఏ.ఆర్.రెహమాన్ బాణీలందించిన కాలం నా ప్రేయసి అనే పాటకు ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ సాహిత్యమందించారు. ఈ చిత్రంలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటించారు.
అజయ్ కీలక పాత్రలో నటించాడు. భారీ బడ్జెట్ తో కథానాయకుడు సూర్య నిర్మించిన ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ఇటీవలే విడుదల చేసిన 24 చిత్ర టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టైమ్ ఆధారంగా నడిచే ఈ చిత్ర కథలో హీరో సూర్య విభిన్నంగా కనిపించబోతున్నారు. ఇప్పటివరకు ఈ తరహా కథ, కథనాలు మనం చూడలేదు. దర్శకుడు విక్రమ్ కుమార్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను రూపొందించారు. ఎ.ఆర్.రెహమాన్ అద్భుతమైన బాణీలు చిత్ర కథకు ప్రాణం పోశాయి. అంతే కాదు రీ రికార్డింగ్ తో ప్రతీ సన్నివేశం అబ్బురపరుస్తుంది. చంద్రబోస్, శంశాంక్ వెన్నెలకంటి మంచి సాహిత్యమందించారు. ఈ చిత్ర ఆడియో కోసం యావత్ సినీ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా చంద్రబోస్ గారు రాసిన కాలం నా ప్రేయసి అనే పాటను విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర పాటల్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తాం. అని అన్నారు.
సూర్య, సమంత, నిత్యామీనన్, అజయ్ తదితరులు ముఖ్యపాత్రలో పోషిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫి - కె.తిరునాపుక్కరసు ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి ప్రొడక్షన్ డిజైన్ - అమిత్ రే మరియు సుభ్రదా చక్రబోర్తి పాటలు - చంద్రబోస్ మరియు శశాంక్ వెన్నెలకంటి సౌండ్ డిజైన్ - లక్ష్మీ నారాయణన్ సౌండ్ ఎఫెక్ట్స్ - ఇక్బాల్ యాక్షన్ - అన్బరివ్ కొరియోగ్రఫీ - రాజు సుందరం, బృంద, దినేష్, శ్రీధర్ విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ - జులియన్ ట్రౌసెల్లియర్ మేకప్ - క్లోవర్ వూటాన్ మరియు ప్రీతి షీల్.జి.సింగ్ కాస్ట్యూమ్ డిజైన్- దర్శన్ జలన్, ఇషా-దివ్య మరియు నిధి-అనిషా స్టిల్స్ - ఆర్.వెంకట్రామ్ పబ్లిసిటీ డిజైన్ - రైసింగ్ ఆపిల్, రెడ్ డాట్ పి.ఆర్.ఓ - ఎస్ కె ఎన్ మరియు ఏలూరు శ్రీను ప్రొడక్షన్ కంట్రోలర్ - బి.సెంథిల్ కుమార్ లైన్ ప్రొడ్యూసర్ - ప్రశాంత్ వర్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - శ్రేయాస్ కెదెకర్ అసోసియేట్ ప్రొడ్యూసర్ - సూరజ్ సాధనా కో ప్రొడ్యూసర్ - రాజశేఖర్ కర్పూర పాండియన్ నిర్మాత - సూర్య రచన - దర్శకత్వం - విక్రం కె కుమార్
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







