ఇండియా,ఈజిప్టు దేశాలకు నేరుగా విమానాలపై నిర్ణయం తీసుకోలేదన్న డీజీసీఏ

- August 25, 2021 , by Maagulf
ఇండియా,ఈజిప్టు దేశాలకు నేరుగా విమానాలపై నిర్ణయం తీసుకోలేదన్న డీజీసీఏ

కువైట్: ఇండియా, ఈజిప్టు దేశాలకు నేరుగా విమానాలు నడిపే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని డైరెక్టర్ జనరల్ ఫర్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ స్పష్టం చేసింది. డీజీసీఏ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ అబ్ధుల్లా ఫదౌస్ అల్ రాజీ మాట్లాడుతూ, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.ఇండియా, ఈజిప్టులకు నేరుగా విమానాలు నడిపే విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇండియా, ఈజిప్టు సహా మొత్తం ఆరు దేశాల విషయమై, నిర్ణయం జరిగిన తర్వాత అధికారికంగా వెల్లడిస్తామని అన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com